అభిమానానికి పరాకాష్ఠ .. బీఎస్పీకి బదులు బీజేపీకి ఓటేశానని వేలు నరుక్కున్న యువకుడు!
- ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నియోజకవర్గంలో ఘటన
- మరోసారి పొరపాటు జరగకూడదని వేలు నరుక్కున్న యువకుడు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్
బీఎస్పీ మద్దతుదారుడైన పవన్ కుమార్ (25) ఓటు హక్కు వినియోగించుకునేందుకు గురువారం ఉదయం షికార్‌పూర్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు. అయితే, బీఎస్పీకి ఓటేయబోయి పొరపాటున బీజేపీకి ఓటు వేశాడు. పొరపాటు జరిగిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన పవన్ మరోసారి ఇలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో ఓటు వేసిన వేలిని కత్తితో తెగ్గోసుకున్నాడు. వేలు నరుక్కుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.