Andhra Pradesh: రేపు కర్నూలు జిల్లాకు వెళ్లనున్న చంద్రబాబు?

  • కర్ణాటకలోని రాయచూర్ లో రేపు చంద్రబాబు ప్రచారం
  • మార్గమధ్యంలో ఓర్వకల్లులో ఆగనున్న బాబు
  • పార్టీ నేతలతో భేటీ కానున్నట్టు సమాచారం
కర్ణాటకలోని రాయచూర్ లో ఎన్నికల ప్రచారం కోసం రేపు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. మార్గమధ్యంలో కర్నూలు జిల్లాలో ఆయన ఆగనున్నారు. ఓర్వకల్లులోని రాక్ గార్డెన్స్ లో జిల్లా టీడీపీ నేతలతో ఆయన భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కర్నూలులో పార్టీ పరిస్థితి గురించి, గెలుపు అవకాశాలపై మాట్లాడనున్న్టట్లు పార్టీ వర్గాల సమాచారం. అనంతరం, రాయచూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చంద్రబాబు వెళతారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాగా, కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కల్యాణోత్సవంలో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. 
Andhra Pradesh
Kurnool District
Karnataka

More Telugu News