saidharam tej: నా వెనుక ముగ్గురు మామయ్యలు వున్నారు: సాయిధరమ్ తేజ్

  • నాకు అందరి సపోర్ట్ వుంది 
  • ఒంటరి పోరాటమే ఇష్టం
  • విజయం వెనుక నా కృషి ఉండాలి  
వరుసగా ఆరు పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయిన సాయిధరమ్ తేజ్, 'చిత్రలహరి'కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఊరట చెందాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. " చరణ్ కి చిరంజీవి .. వరుణ్ తేజ్ కి నాగబాబు .. అల్లు అర్జున్ కి అరవింద్ గారి గైడన్స్ వుంది. అలాంటి గైడన్స్ లేకపోవడం వల్లనే తేజు వెనుకబడ్డాడనే టాక్ వుంది. ఇందుకు మీ సమాధానమేమిటి?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ నుంచి తేజుకి ఎదురైంది.

 అందుకు ఆయన స్పందిస్తూ .. చరణ్ కి చిరంజీవిగారి గైడన్స్ .. వరుణ్ కి నాగబాబుగారి గైడన్స్ .. అల్లు అర్జున్ కి అరవింద్ గారి గైడన్స్ మాత్రమే వున్నాయి. ఆ ముగ్గురి గైడన్స్ నాకు ఉండటం నా అదృష్టం. నాకు మా ముగ్గురు మామయ్యల సపోర్టు ఎప్పుడూ ఉంటుంది. అవసరమైతే వాళ్ల గైడన్స్ ఉంటుంది. అయితే ఒంటరిగానే ముందుకు వెళుతూ .. కష్టనష్టాలను ఫేస్ చేస్తూ .. నా కృషితో విజయాలను అందుకోవాలనేది నా ఆలోచన" అని చెప్పుకొచ్చాడు.
saidharam tej

More Telugu News