కృష్ణా జిల్లా తాగునీటిపై సమీక్షకు 10 మంది ఎంపీడీవోల డుమ్మా.. షోకాజ్ నోటీసులు జారీచేసిన జెడ్పీ సీఈవో!

  • ఏపీలో పలు ప్రాంతాలలో నీటికి కటకట 
  • నీటి ఎద్దడిపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం
  • ఎందుకు గైర్హాజరు అయ్యారో చెప్పాలని నోటీసులు
వేసవి సమీపించడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తాగునీటికి కటకట ఏర్పడుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ‘జలవాణి’ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో తాగునీటికి సంబంధించి విజయవాడలో కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.

అయితే ఇందుకు 10 మంది ఎంపీడీవోలు డుమ్మా కొట్టారు. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జిల్లాలో నీటి ఎద్దడిపై సాక్షాత్తూ కలెక్టర్ నిర్వహించిన సమావేశానికి రాకపోవడంపై ఈ 10 మంది ఎంపీడీవోలకు జెడ్పీ సీఈవో సలాం షోకాజ్ నోటీసులు జారీచేశారు. అసలు సమావేశానికి ఎందుకు గైర్హాజరు అయ్యారో చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Krishna District
10 mpdo
showcause notice
zp ceo

More Telugu News