kaleswaram: రూ.లక్ష కోట్లు దాటనున్న కాళేశ్వరం వ్యయం

  • తాజాగా మరో రూ.20వేల కోట్లు పెరగడంతో ఈ స్థితి
  • గోదావరి ఎత్తిపోతల పథకంగా నిర్మాణం
  • తెలంగాణలోనే అతి పెద్ద ప్రాజెక్టు

తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్టు, గోదావరి జలాల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం భారీగా పెరగనుంది. తాజా అంచనాల ప్రకారం మరో 20 వేల కోట్ల రూపాయలు పెరగనుంది. దీంతో వ్యయం లక్ష కోట్లు దాటుతుందని భావిస్తున్నారు. గోదావరి నుంచి 160 టీఎంసీ నీటిని తోడిపోసేందుకు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం తొలుత 80 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు ఉన్న నీటి లభ్యత ఆధారంగా రోజుకు రెండు టీఎంసీల నీటిని తోడేందుకు ప్రాజెక్టును రీడిజైన్‌ చేశారు. దీంతో వ్యయం కూడా పెరుగుతోంది. ఎత్తి పోసిన నీటిని నిల్వచేసేందుకు చిన్నవి, పెద్దవి కలిపి 20 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఇందులో 140 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. మిగిలిన నీటితో చెరువులు నింపాలని ఆలోచిస్తున్నారు.

More Telugu News