హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడి బైకర్ దుర్మరణం!
- అతివేగంగా వచ్చి బైకును ఢీకొట్టిన బస్సు
- అంతెత్తున ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
- మృతుడు రామాంతపూర్ కు చెందిన హరినాయక్
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో రామాంతపూర్ కు చెందిన హరినాయక్ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. హరినాయక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు జనగామ డిపోకు చెందినదని పేర్కొన్నారు. బస్సు అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.