rai lakshmi: 'నాగకన్య'గా వస్తున్న తమిళ చిత్రం

  • తమిళంలో నిర్మితమైన 'నీయా 2'
  • నాగకన్యల నేపథ్యంలో సాగే కథ 
  • మే 10వ తేదీన రెండు భాషల్లోను విడుదల  
నాగకన్యల నేపథ్యంలో తెలుగులో వచ్చిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి. తమిళం నుంచి వచ్చిన అనువాద చిత్రాలు కూడా భారీ వసూళ్లను సాధించాయి. అలా నాగకన్యల నేపథ్యంలో తమిళంలో 'నీయా 2' సినిమా నిర్మితమైంది. 'జర్నీ' ఫేమ్ జై కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, నాగకన్యలుగా రాయ్ లక్ష్మీ .. వరలక్ష్మీ శరత్ కుమార్ .. కేథరిన్ నటించారు.

ఎల్.సురేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగులోను మే 10వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'నాగకన్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కథాకథనాలు .. గ్రాఫిక్స్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయనే అభిప్రాయాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేశారు. ఈ సినిమాలో నాగకన్యలుగా కనిపించే ముగ్గురు కథానాయికలకు తెలుగులో మంచి గుర్తింపు వుంది. ఇక పాము నేపథ్యంలో సాగే కథల పట్ల ఆసక్తిని చూపేవాళ్లు కూడా ఇక్కడ ఎక్కువే. అందువలన ఈ సినిమాపై దర్శక నిర్మాతలు ఆశాభావంతో వున్నారు. 
rai lakshmi
catherine
varalakshmi

More Telugu News