Aadhar card: ‘డేటా చోరీ’ కేసులో ఆధార్ సంస్థ కీలక ప్రకటన.. ఐటీగ్రిడ్స్ సంస్థ డేటా చోరీ చేయలేదన్న యూఐడీఏఐ

  • మా సర్వర్లు అత్యంత భద్రంగా ఉన్నాయి
  • సర్వీస్ ప్రొవైడర్లు, వ్యక్తుల నుంచి ఆధార్ వివరాలు సేకరణ మామూలే
  • అవి తెలుసుకున్నంత మాత్రాన పౌరులకు నష్టం జరగదు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన డేటా చోరీ కేసులో ఆధార్ (యూఐడీఏఐ) సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చింది. తమ సర్వర్ల నుంచి ఆ సంస్థ అక్రమంగా, చట్టవిరుద్ధంగా ఎటువంటి డేటాను చోరీ చేయలేదని పేర్కొంది. తమ సర్వర్లు అత్యంత భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

ఐటీగ్రిడ్ సంస్థ పెద్ద సంఖ్యలో ప్రజల ఆధార్ వివరాలను సేకరించిందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు యూఐడీఏఐ తెలిపింది. అయితే, తమ సర్వర్ల నుంచి ఐటీగ్రిడ్ సంస్థ డేటాను చోరీ చేసినట్టు తమకు ఆధారాలు లభించినట్టు సిట్ ఎక్కడా పేర్కొనలేదని ఆధార్ సంస్థ పేర్కొంది.

  సర్వీస్ ప్రొవైడర్లు, వ్యక్తుల నుంచి వారి ఆధార్, ఇతర వివరాలను సేకరించడం సర్వసాధారణమేనని తేల్చి చెప్పింది. అయితే, సేకరించిన సమాచారాన్ని ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఇతరులకు అందిస్తే మాత్రం చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. కేవలం ఆధార్ సంఖ్య, పేరు, వివరాలు తెలుసుకున్నంత మాత్రాన పౌరులకు ఎటువంటి నష్టం ఉండదని స్పష్టం చేసింది. అయితే, ఐటీ గ్రిడ్ సంస్థ ఏ అవసరం కోసం ఆధార్ వివరాలు సేకరించింది.. ఈ విషయంలో ఎక్కడైనా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందా? అన్న దానిపైనే పోలీసులకు  ఫిర్యాదు చేశామని ఆధార్ సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News