Uttam Kumar Reddy: కొండా విశ్వేశ్వరరెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు: ఉత్తమ్

  • స్థానిక సంస్థల ఎన్నికలకు యాక్షన్‌ ప్లాన్‌
  • అభ్యర్థుల జాబితా రెండు రోజుల్లో విడుదల
  • మంద కృష్ణ మాదిగకు అండగా ఉంటాం

బీఆర్ అంబేద్కర్‌కు జరిగిన అవమానంపై దేశవ్యాప్త చర్చకు వెళతామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. నేడు గాంధీభవన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు యాక్షన్‌ ప్లాన్‌ రూపకల్పన చేశారు.

అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగను హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరంకుశమన్నారు. ఆయనకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News