vikram: చియాన్ విక్రమ్ బర్త్ డే స్పెషల్ గా 'కడరమ్ కొండన్' మేకింగ్ వీడియో

  • విక్రమ్ తాజా చిత్రంగా 'కడరమ్ కొండన్'
  • ముఖ్య పాత్రల్లో పూజా కుమార్ ..  అక్షర హాసన్
  •  తెలుగులోను విడుదల చేసే ఆలోచన    

మొదటి నుంచీ కూడా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రల్లో కనిపించడానికే విక్రమ్ ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఆయన తాజా చిత్రమైన 'కడరమ్ కొండన్'లోను ఆయన కొత్త లుక్ తో కనిపించనున్నారు. ఈ సినిమాకి ఆయన లుక్ హైలైట్ అని చెబుతున్నారు. కమల్ హాసన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, రాజేశ్ ఎం.సెల్వ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ రోజున విక్రమ్ పుట్టినరోజు .. 53వ వసంతంలోకి ఆయన అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. విక్రమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దర్శకుడు రాజేశ్ ఎం.సెల్వ ఈ మేకింగ్ వీడియోను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో విక్రమ్ అభిమానులను ఫిదా చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో పూజా కుమార్ .. అక్షర హాసన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

More Telugu News