YSRCP: మే 23న ఎన్నికల ఫలితాలొస్తాయి.. తల ఎక్కడ పెట్టుకుంటావు కోడెల?: అంబటి రాంబాబు

  • మే 23న ప్రజాస్వామ్య బద్ధంగా దాడి జరగబోతోంది
  • కోడెల శివప్రసాద్ సిద్ధంగా ఉండాలి
  • కోడెల రాజకీయ జీవితం దుర్మార్గం
మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజున ప్రజాస్వామ్య బద్ధంగా దాడి జరుగుతుందని, ఆ దాడిని ఎదుర్కొనేందుకు కోడెల శివప్రసాద్ సిద్ధంగా ఉండాలంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏదో గెలిచిపోతానని కోడెల అనుకుంటున్నారని, ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజున ఆయన తన తల ఎక్కడ పెట్టుకుంటారు? అని ప్రశ్నించిన అంబటి, తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తనది నలభై ఏళ్ల రాజకీయ జీవితమని కోడెల చెప్పుకుంటున్నారని, ఈ నలభై ఏళ్ల రాజకీయ జీవితమంతా పోలింగ్ బూత్ లు క్యాప్చర్ చేయడం, ఎన్నికల సిబ్బందిని, అధికారులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం, బాంబులు వేయడం, వర్గాల మధ్య తగాదాలు పెట్టడం వంటి దుర్మార్గపు చర్యలు చేశారని దుమ్మెత్తి పోశారు.
YSRCP
ambati
Telugudesam
kodela
sattenapalli

More Telugu News