విచారణ సమయంలో జేడీ లక్ష్మీనారాయణ ఐఏఎస్ శ్రీలక్ష్మిని కొట్టారు.. సంచలన ఆరోపణ చేసిన బీజేపీ నేత!
- ఓబులాపురం మైనింగ్ కేసులో ఇది జరిగింది
- విచారణ సందర్భంగా శ్రీలక్ష్మిని కొట్టారు
- ఆమె కొలీగ్ స్వయంగా ఈ విషయం నాతో చెప్పారు
సీబీఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో జేడీ ఓ మహిళ అని కూడా చూడకుండా శ్రీలక్ష్మిపై దాడిచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో రఘురాం ఈ మేరకు స్పందించారు. ఇప్పుడు శ్రీలక్ష్మి నడవలేని స్థితిలో వీల్ చెయిర్ కు పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ వ్యవహారంపై జనసేన నేత లక్ష్మీనారాయణ ఇంతవరకూ స్పందించలేదు.