China: తల్లి గర్భంలోనే కవలల ఫైటింగ్... వీడియో విడుదల... బాక్సర్లవుతారంటున్న నెటిజన్లు!

  • చైనా మహిళ గర్భంలో కవలలు
  • అల్ట్రాసౌండ్ స్కానింగ్ ను వీడియో తీసిన భర్త
  • సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్
తోడబుట్టిన వారు కొట్లాడుకుంటారన్న సంగతి అందరికీ తెలుసు. అదే వారు కవలలైతే పోటీ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ, తల్లి గర్భంలో ఉన్న సమయంలోనే ఇద్దరు కొట్టుకుంటుంటే... ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. చైనాకు చెందిన ఓ మహిళ గర్భంతో ఉన్న వేళ, వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసిన వీడియో ఇది. ఆమె గర్భంలోని కవలలు ఒకరితో ఒకరు ఫైటింగ్ కు దిగారు. దీన్ని వీడియో తీసిన బిడ్డల తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వీరిద్దరూ బాక్సర్లు అయిపోవడం ఖాయమంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బయటకు వచ్చాక ఇంకెలా తన్నుకుంటారోనన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తెగ వైరల్ అవుతున్న వీడియోను చూసేయండి.
China
Womb
Twins
Viral Videos

More Telugu News