ఇది ఓటర్ ఐడీ కాదు... వివాహ శుభలేఖ!
- వినూత్నతను సంతరించుకుంటున్న పెళ్లి పత్రికలు
- ఓటు హక్కుపై చైతన్యం తేవాలన్న ఆలోచనలో వధూవరులు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శుభలేఖ
కర్ణాటకలోని ధార్వాడలో బెస్కాం అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న మంజునాథ్ కుమారుడు సునీల్ కు, హెస్కాంలో ఇంజనీర్ గా పని చేస్తున్న మహేశ్ అనే యువకుడి సోదరి అన్నపూర్ణలకు ఈనెల 26న వివాహం నిశ్చయించారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటు ఆవశ్యకతను తమ పెళ్లికి వచ్చే బంధు మిత్రులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో, వీరు తమ శుభలేఖను వినూత్నంగా తీర్చిదిద్దారు. ఈ కార్డును మీరూ చూడవచ్చు.