Chegondi Harirama Jogaiah: టీడీపీకి ఈ 'పీకే' లాభంకన్నా.. ఆ 'పీకే'తో నష్టమే ఎక్కువ: చేగొండి కీలక వ్యాఖ్యలు

  • పుసుపు - కుంకుమతో ఓట్లు రాలుతాయనుకోవడం అత్యాశే 
  • జనసేనతో టీడీపీకి కలిగే నష్టమే అధికం
  • ఏ పార్టీకీ 90 సీట్లు మించి రాబోవన్న జోగయ్య

ఏపీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు తీసుకువచ్చిన 'పసుపు - కుంకుమ' పథకం ఓట్లను రాలుస్తుందని భావించడం అత్యాశే అవుతుందని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి వెంకట హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 'పసుపు - కుంకుమ' (పీకే)తో వస్తాయని భావించే ఓట్లతో పోలిస్తే, పవన్ కల్యాణ్ (పీకే) స్థాపించిన జనసేనతో కలిగే నష్టమే అధికమని ఆయన అభిప్రాయపడ్డారు.

 వైసీపీ గత ఎన్నికలతో పోలిస్తే, ఇప్పుడు ఏ కొత్త వర్గాన్నీ ఆకట్టుకోలేకపోయిందని, మాయావతితో పవన్ పొత్తు వల్ల ఎస్సీల ఓట్లలో చీలిక వచ్చిందని, ఆ మేరకు జగన్ ఎన్నో ఓట్లను నష్టపోయారని విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ 90 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి లేదని, అధికార, విపక్ష పార్టీల మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుందని జోగయ్య వ్యాఖ్యానించారు.

More Telugu News