Vikarabad: చేవెళ్ల సమీపంలో ఘోర ప్రమాదం... బుల్లితెర నటులు భార్గవి, అనూష మృతి!

  • షూటింగ్ నిమిత్తం వికారాబాద్ అడవులకు
  • తిరుగు ప్రయాణంలో చెట్టును ఢీకొన్న కారు
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఓ షూటింగ్ నిమిత్తం వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లిన టీమ్, తిరుగుప్రయాణమై వస్తున్న వేళ, ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయిన వీరి కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదం చేవెళ్ల సమీపంలోని అప్పారెడ్డి గూడ బస్టాప్ వద్ద జరిగింది.

 ఓ సీరియల్ లో నటిస్తున్న వీరు షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా, నిర్మల్‌ కు చెందిన భార్గవి (20), భూపాలపల్లి జయశంకర్‌ జిల్లాకు చెందిన అనుషారెడ్డి (21) మరణించారు. కారు డ్రైవర్‌ చక్రి, వీరితో పాటు ప్రయాణిస్తున్న వినయ్‌ కుమార్‌ లకు తీవ్ర గాయాలు కాగా, వీరిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు మోయినాబాద్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Vikarabad
Shooting
Road Accident
Bhargavi
Anusha Reddy

More Telugu News