Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సినిమా అవకాశాల గురించి రష్మిక 
  • ద్విపాత్రాభినయం చేస్తున్న రజనీకాంత్ 
  • మరో తెలుగు సినిమాలో టబు
 *  తనకు సినిమాలలో అవకాశాలు పెద్దగా కష్టపడకుండానే వచ్చాయంటోంది కథానాయిక రష్మిక. 'ఇక్కడ అవకాశాలు రావడం ఎంతో అదృష్టం. ఆ అదృష్టం నాకు లభించింది. ఎవర్నీ అడగక్కర్లేకుండానే అవకాశాలు వస్తున్నాయి. దీనిని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నాను' అని చెప్పింది.  
*  రజనీకాంత్ తాజాగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రజనీ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
*  నిన్నటితరం కథానాయిక టబు తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మరో తెలుగు చిత్రాన్ని కూడా ఆమె అంగీకరించింది. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందే పిరీడ్ ఫిలింలో నటించడానికి టబు ఓకే చెప్పిందట.
Rashmika
Rajanikanth
Murugadas
Tabu

More Telugu News