DMK: డీఎంకే నేత కనిమొళి నివాసంలో ఐటీ సోదాలు

  • ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తున్నారన్న ఆరోపణలు
  • తూత్తుకుడిలోని నివాసం, కార్యాలయంలో సోదాలు  
  • అక్కడికి తరలి వెళ్లిన డీఎంకే శ్రేణులు 

డీఎంకే నేత కనిమొళి నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ఆమె నివాసం, పార్టీ కార్యాలయంలో పది మంది ఐటీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆమె భారీగా నగదు వినియోగిస్తున్నారన్న ఆరోపణల మేరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న డీఎంకే శ్రేణులు ఆమె నివాసం వద్దకు చేరుకున్నాయి. లోపలికి వెళ్లేందుకు యత్నించిన డీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

More Telugu News