vijay: వివాదంలో విజయ్ - అట్లీకుమార్ మూవీ, కథ తనదేనంటూ వర్ధమాన దర్శకుడి ఫిర్యాదు

  • విజయ్ కథానాయకుడిగా అట్లీ కుమార్ మూవీ
  •  అది తన కథేనంటూ వర్థమాన దర్శకుడి ఆరోపణ
  •  కోలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్      
గతంలో విజయ్ తో 'తెరి' .. 'మెర్సల్' వంటి భారీ చిత్రాలను తెరకెక్కించి విజయాలను సాధించిన అట్లీ కుమార్, ఆయనతో మూడవ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. విజయ్ కెరియర్లో ఇది 63వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. నయనతార కథానాయిక కావడంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో ఈ కథ తనదనీ, తనకి తెలియకుండా తన కథతో సినిమా తీస్తున్నారని దక్షిణ భారత ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ లో వర్థమాన దర్శకుడు శివ ఫిర్యాదు చేశాడు. ఒక నిర్మాత ద్వారా ఈ కథ అట్లీకి లీక్ అయ్యుంటుందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశాడు. తనకి న్యాయం జరగడం కోసం కోర్టుకు కూడా వెళతానని శివ అన్నట్టుగా తమిళ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై సినిమా టీమ్ స్పందించవలసి వుంది. ఇది ఎంతవరకూ వెళుతుందోననేది కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.
vijay
atlee kumar

More Telugu News