renu desai: మా పాప ఆద్యకి నేను చెప్పేదొక్కటే: రేణు దేశాయ్

  • అకీరా తెలుగు బాగా మాట్లాడతాడు
  • 'ఆద్య'కి తెలుగు తెలియదు 
  • మరాఠీ మాట్లాడమని ఆద్యతో చెబుతుంటాను

రేణు దేశాయ్ కొడుకు పేరు అకీరా నందన్ .. కూతురు పేరు 'ఆద్య'. ఈ ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం ఆమె పూణేలో ఉంటున్నారు. అకీరాతో ఆమె తెలుగులో మాట్లాడతారు. ఇక ఆద్యతో మరాఠీలో మాట్లాడతారు. అందుకు గల కారణమేమిటనే ప్రశ్న ఆమెకి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .. "అకీరా హైదరాబాదులో పుట్టిపెరగడం వలన తెలుగు బాగా మాట్లాడతాడు. 'ఆద్య' కూడా హైదరాబాదులోనే పుట్టింది. కాకపోతే .. చిన్నప్పటి నుంచి పూణేలోనే వుంది. అందువలన దానికి తెలుగు తెలియదు .. మరాఠీ వచ్చు. అయితే తాను ఇంగ్లిష్ ఎక్కువగా మాట్లాడుతుంది. నాకు మాతృభాష అంటే ఇష్టం .. అందువలన మరాఠీలో మాట్లాడమని దానికి చెబుతూ వుంటాను. ఒక్క మా అమ్మాయనే కాదు .. ఎక్కడ చూసినా అంతా ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. నేను మాత్రం 'ఆద్య'తో సాధ్యమైనంతవరకూ మాతృభాషలో మాట్లాడించడానికే ప్రయత్నం చేస్తూ వుంటాను" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News