chiranjeevi: కేరళలోని దట్టమైన అడవుల్లో 'సైరా' షూటింగు

  • షూటింగు దశలో 'సైరా'
  • కేరళ అడవుల్లో పోరాట సన్నివేశాలు
  •  హైదరాబాద్ షెడ్యూల్ తో షూటింగు పార్టు పూర్తి

చిరంజీవి కథానాయకుడిగా .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం కేరళలో షూటింగు జరుపుకుంటోంది. చిరంజీవి .. తదితరులపై కేరళలోని దట్టమైన అడవుల్లో, భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. 10 రోజుల పాటు అక్కడ పోరాట సన్నివేశాలనే చిత్రీకరిస్తారు. హైదరాబాద్ వచ్చిన తరువాత, ఇక్కడ ఒక షెడ్యూల్ షూటింగు జరగనుంది. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుంది. ఆ తరువాత వీఎఫెక్స్ పూర్తికావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అమితాబ్ .. జగపతిబాబు .. విజయ్ సేతుపతి .. సుదీప్ వంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. 

More Telugu News