Congress: ఆసుపత్రిలో శశిథరూర్‌ను పరామర్శించిన రక్షణ మంత్రి.. రాజకీయాల్లో హుందాతనానికి ఆమె నిదర్శనమన్న కాంగ్రెస్ నేత

  • తులాభారంలో శశిథరూర్ తలకు తీవ్ర గాయం
  • థరూర్‌ను పరామర్శించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్న కేంద్రమంత్రి
  • ఫొటో పోస్టు చేసి కొనియాడిన శశిథరూర్

తులాభారంలో గాయపడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం లోక్‌సభ అభ్యర్థి శశిథరూర్‌ను సోమవారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిర్మల ఆసుపత్రిలో తనతో చేతులు కలిపి మాట్లాడుతున్న ఫొటోను ట్వీట్ చేసిన శశిథరూర్.. భారత రాజకీయాల్లో ఇలాంటి దృశ్యాలు చాలా అరుదని పేర్కొన్నారు. రాజకీయాల్లో హుందాతనానికి ఇది నిదర్శనమని అన్నారు. ఇదో గొప్ప అనుభూతని, హుందాతనానికి ఆమె నిదర్శమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరం కత్తులు దూసుకున్నామని, అయినప్పటికీ ఆసుపత్రిలో ఉన్న తనను పరామర్శించేందుకు వచ్చారని శశిథరూర్ గుర్తు చేసుకున్నారు.

కాగా, థంపనూరులోని గాంధారి అమ్మన్ కోవిల్ ఆలయంలో తులాభారం సందర్భంగా థరూర్ తలకు తీవ్ర గాయమైంది. రక్తమోడుతున్న థరూర్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, తలకు 11 కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News