TRS: కండ్లకలకతో బాధపడుతున్న కేటీఆర్.. పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరు

  • కళ్లను పరీక్షించిన వైద్యులు
  • నాలుగు రోజులు విశ్రాంతి అవసరమని సలహా
  • విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను పోస్టు చేసిన కేటీఆర్
టీఆర్ఎస్ అగ్రనేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండ్లకలకతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కండ్లకలక కారణంగా సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి కూడా హాజరు కాలేకపోయారు. ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హాజరైన కేటీఆర్‌ కళ్లలో ఏదో ఇబ్బందిగా ఉండడంతో వెంటనే వెళ్లి వైద్యులను కలిశారు.

 కళ్లను పరీక్షించిన వైద్యులు కండ్లకలక సోకిందని చెప్పి వైద్యం చేశారు. కళ్లు బాగా ఎర్రగా మారి ఇబ్బంది పెడుతుండడంతో నాలుగు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో అటునుంచి అటే ఇంటికి వెళ్లిన కేటీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న కేటీఆర్.. విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను పోస్టు చేశారు.
TRS
KTR
conjunctiva
Doctors
Twitter

More Telugu News