'చిత్రలహరి' తొలి మూడు రోజుల వసూళ్లు
- రొమాంటిక్ చిత్రంగా 'చిత్రలహరి'
- తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్
- అమెరికాలో నిరాశ పరుస్తోన్న వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 7.95 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 9.50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 13 కోట్లకే అమ్మడం జరిగింది. అందువలన తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటుతుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా అమెరికాలోను ఈ సినిమా జోరుమీద ఉంటే బాగుండేదనేది అభిమానుల మాట. తాజాగా ఈ సినిమాపై చిరంజీవి తన స్పందనను తెలియజేసిన విషయం తెలిసిందే.