Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం.. కాన్వాయ్ పై రాళ్ల వర్షం!

  • బిజ్‌బెహరా పట్టణానికి వెళుతుండగా ఘటన
  • మెహబూబా సురక్షిత ప్రాంతానికి తరలింపు
  • అనంతనాగ్ నుంచి పోటీ చేస్తున్న మెహబూబా 
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి సొంత నియోజకవర్గంలో తీవ్ర నిరసన ఎదురయింది. అనంతనాగ్ లోక్ సభ నియోజకవర్గంలో ఈరోజు పార్టీ కార్యకర్తలతో సమావేశమైన అనంతరం మెహబూబా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఖిరాం గ్రామంలో దర్గాను సందర్శించి బిజ్‌బెహరా పట్టణానికి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు ఆమె కాన్వాయ్ పై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించాయి.

ఈ ఘటనలో మెహబూబా డ్రైవర్ కు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్న భద్రతాబలగాలు, దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలింపు చేపట్టాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెహబూబా అనంతనాగ్ జిల్లా నుంచి గెలుపొందారు. ప్రస్తుతం ఇదే సీటు నుంచి మెహబాబూ మరోసారి పోటీ చేస్తున్నారు.
Jammu And Kashmir
Chief Minister
mehabuba
convay
Police
stones

More Telugu News