Andhra Pradesh: ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను ప్రారంభించిన నాగబాబు!

  • ఇప్పటికే ఫేస్ బుక్ లో చురుగ్గా నాగబాబు
  • స్నేహితులు, కార్యకర్తల సూచన మేరకే ప్రారంభం
  • లింక్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేత
మెగాబ్రదర్, జనసేన తరఫున నర్సాపురం నుంచి లోక్ సభకు పోటీపడిన నాగబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్ లో చురుగ్గా ఉన్న ఆయన తాజాగా ప్రజల్లోకి మరింతగా చొచ్చుకెళ్లేందుకు వీలుగా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను ప్రారంభించారు.

ఈ విషయమై నాగబాబు స్పందిస్తూ..‘హలో ఫ్రెండ్స్.. మీ అందరికీ మరింత చేరువయ్యేందుకు వీలుగా, అభిమానులు, స్నేహితులు జనసేన కార్యకర్తల విజ్ఞప్తి మేరకు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్లను ప్రారంభిస్తున్నా’ అని తెలిపారు. ఈ రెండింటికి సంబంధించిన లింక్ లను ఫేస్ బుక్ పోస్ట్ లో పోస్ట్ చేశారు.
Andhra Pradesh
Nagababu
Jana Sena
Twitter
Instagram
Facebook

More Telugu News