TRS: ప్రమాణస్వీకారం చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలు

  • డిప్యూటీ ఛైర్మన్ ఛాంబర్ లో ప్రమాణస్వీకారం
  • ప్రమాణం చేసిన వారిలో నలుగురు టీఆర్ఎస్, ఒక ఎంఐఎం సభ్యుడు
  • కార్యక్రమానికి హాజరైన కేటీఆర్
తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, రియాజ్ ఉల్ హసన్, యెగ్గే మల్లేశంలు ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ఛాంబర్ లో వీరంతా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో నలుగురు టీఆర్ఎస్, మరొకరు ఎంఐఎం సభ్యుడు ఉన్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.
TRS
mlc
oath
telangana

More Telugu News