Fire Accident: విజయనగరం చిన్న మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

  • అగ్నికి ఆహుతైన 50 షాపులు
  • అందరూ చిరు వ్యాపారులే
  • ఏళ్ల నాటి నుంచి వర్తకం చేస్తూ జీవనోపాధి

విజయనగరం మున్సిపాలిటీలో నగరం నడిబొడ్డున చారిత్రక గంట స్తంభాన్ని ఆనుకుని ఉన్న చిన్న మార్కెట్‌లో నేటి తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యాభై షాపులు భస్మీపటలమయ్యాయి. మున్సిపాలిటీ ప్రధాన కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న రోడ్డుకు ఇటువైపు చేపల మార్కెట్‌, కూరగాయల మార్కెట్లు ఉన్నాయి.

ఈ మార్కెట్‌ను ఆనుకుని కన్యాకాపరమేశ్వరి ఆలయం రోడ్డువైపు బంగారం షాపులు కూడా ఉన్నాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్కెట్‌ ఇరుకుగా ఉంటుంది. ఇందులో కూరగాయల మార్కెట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపులో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు జరగడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మంటలను గుర్తించినప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ద ఎత్తున లేచిన అగ్నికీలలు చుట్టుపక్కల ఉన్న యాభై షాపులకు విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు.

  • Loading...

More Telugu News