Jet Airways: ప్రస్తుతానికి గట్టెక్కింది... సమ్మెను వాయిదా వేసుకున్న జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు!

  • నేటి నుంచి జరగాల్సిన సమ్మె
  • యాజమాన్యానికి మరో అవకాశం ఇస్తాం
  • సమ్మె వాయిదా తరువాత గిల్డ్ ప్రకటన

తమకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, నేటి నుంచి ఉద్యోగులు తలపెట్టిన నిరవధిక సమ్మె వాయిదా పడింది. దీంతో జెట్ ఎయిర్ వేస్ కు ఊరట లభించింది. తమ 'నో పే నో వర్క్' నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నామని లైలట్స్ బాడీ నేషనల్ ఏవియేటర్ గిల్డ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

 మూడు నెలలుగా వేతనాలు లేవని, అయినప్పటికీ, సంస్థ యాజమాన్యానికి మరికొంత సమయం ఇవ్వాలన్న నిర్ణయంతోనే సమ్మె వాయిదాకు అంగీకరించామని గిల్డ్ ప్రతినిధులు తెలిపారు. కాగా, జెట్ ఎయిర్ వేస్, ఎస్బీఐ మధ్య నేడు కీలక సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సంస్థ తిరిగి కోలుకునేలా కీలక నిర్ణయాలు వెలువడతాయన్న అంచనాల నేపథ్యంలో, మరో అవకాశం ఇవ్వాలన్న సీనియర్ ఉద్యోగుల సూచనలతో ఉద్యోగులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

More Telugu News