Chandrababu: టీడీపీకి పడని ఓట్ల గురించే చంద్రబాబు రచ్చ: జీవీఎల్

  • చంద్రబాబువి చౌకబారు వ్యాఖ్యలు  
  • బాబు తీరుతో ప్రజలు కూడా వ్యథ చెందారు
  •  అధికారులను బదిలీ చేస్తే రాజకీయం చేస్తారా?
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు తీరుతో ప్రజలు వ్యథ చెందారని, తనకు కావాల్సిన అధికారులందరినీ నియమించుకున్నారని, అందులో కొద్ది మందిని ఈసీ బదిలీ చేయడాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

ఈసీ బదిలీ చేసిన అధికారులు లేకపోతే టీడీపీకి ఓట్లు పడవా? అధికారులే ఆ పార్టీకి ఓట్లు వేయిస్తున్నారా? అని ప్రశ్నించారు. టీడీపీకి పడని ఓట్ల గురించి చంద్రబాబు రచ్చ చేస్తున్నారని, ఇదంతా గమినిస్తున్న ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంపై నిరసన పేరుతో మొన్నటి వరకూ ‘ఆరాటం, పోరాటం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టిన చంద్రబాబు, ఇకపై తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందేనని అన్నారు.
Chandrababu
cm
Telugudesam
bjp
gvl
Evm`s

More Telugu News