cpl: ఏపీలో 800 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి: సురవరం

  • మహిళలు తమ ఓటు వేయకుండానే వెనుదిరిగారు
  • ఈవీఎంలపై ఉన్న సందేహాలను తొలగించాలి
  • ఆ బాధ్యత ఎన్నికల సంఘానిదే

మొదటి దశ ఎన్నికల్లో ఏపీలో సుమారు 800 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో చంద్రబాబు ఆధ్వర్యంలో విపక్ష పార్టీల నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ముఖ్యంగా మహిళల ఓపిక నశించి తమ ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారని అన్నారు.

గతంలో ఈవీఎంలు, వీవీప్యాట్స్ లో ఓట్ల తేడాను గమనించామని, అందుకే, ఈవీఎంలపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చిందని అన్నారు. ఈవీఎంలపై ఉన్న సందేహాలను తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని చెప్పారు. ఓట్ల లెక్కింపులో వీవీప్యాట్స్ సంఖ్యను పెంచాల్సిదిగా డిమాండ్ చేస్తున్నామని, మరో మార్గం లేదని, లేకపోతే బ్యాలెట్ పద్ధతినే అనుసరించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News