Chandrababu: ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టి ఏదో సాధించానని కేటీఆర్ అనుకోవడం సిగ్గు చేటు: ఎమ్మెల్సీ మంతెన

  • ఎన్నికల్లో నేరుగా ఎందుకు పోటీ చేయలేదు?
  • చంద్రబాబుతో జగన్‌ని పోలుస్తారా?
  • టీడీపీ భారీ మెజారిటీతో గెలవబోతోంది
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతూ ఏదో సాధించానని చెప్పుకోవాలనుకోవడం సిగ్గుచేటని ఏపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ విమర్శలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీపై అంత ప్రేమ ఉన్నవారు ఏపీ ఎన్నికల్లో నేరుగా ఎందుకు పోటీ చేయలేదని ఆయన ప్రశ్నించారు.

40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబుతో 40 ఏళ్ల అవినీతిపరుడిని పోలుస్తారా? అని మంతెన నిలదీశారు. టీడీపీ భారీ మెజారిటీతో గెలవబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ఏపీ ప్రజలు అవినీతిపరుడికి అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా లేరన్నారు.
Chandrababu
Manthena Satyanarayana
Jagan
KTR
Andhra Pradesh

More Telugu News