Andhra Pradesh: ఈవీఎంలు హ్యాకింగ్ చేయొచ్చని గతంలోనే చెప్పాను: ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్

  • నాడు వీవీప్యాట్స్ రూపకల్పనలో సలహాలిచ్చాను
  • వీవీప్యాట్స్ లో సమస్యలు చెప్పేందుకు ఈసీని కలిశా  
  • రాజకీయ కారణాలతో నన్ను అనుమతించ లేదు

ఈవీఎంలు హ్యాకింగ్ చేయొచ్చని గతంలోనే చెప్పానని ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్ అన్నారు. ఢిల్లీలో చంద్రబాబు ఆధ్వర్యంలో విపక్ష పార్టీల నేతలతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరిప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఓటర్లు తాము వేసిన ఓటును వీవీ ప్యాట్స్ లో చూసుకునేందుకు 7 సెకన్ల సమయం ఉంటుంది, అయితే, ఆ సమయం 3 సెకన్లకే పరిమితమైంది. దీన్ని ఆయన తప్పుబట్టారు.

గతంలో వీవీప్యాట్స్ రూపకల్పనలో ఈసీ తన సలహాలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ, వీవీప్యాట్స్ లో ఉన్న సమస్యలను తెలిపేందుకు ఈసీ వద్దకు వెళ్లానని, అయితే, రాజకీయ కారణాలతోనే తనను అనుమతించ లేదని అన్నారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరగాలని ఈ సందర్భంగా హరిప్రసాద్ కోరారు.

More Telugu News