New Delhi: ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి: కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ

  • 15 ప్రాంతీయ, 6 జాతీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి
  • 50 శాతం వీవీప్యాట్స్ లెక్కించాలనేది తమ డిమాండ్
  • ఢిల్లీలో విపక్షాల మీడియా సమావేశంలో సింఘ్వీ

ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీకి వెళ్లి సీఈసీకి సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ లో క్లబ్ లో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విపక్షపార్టీలు హాజరయ్యాయి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ, ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నది తమ డిమాండ్ అని  అన్నారు. 15 ప్రాంతీయ, 6 జాతీయ పార్టీలు మద్దతుగా నిలిచాయని, ఎలాంటి పరిశీలన లేకుండా లక్షలాది ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. 50 శాతం వీవీప్యాట్స్ లెక్కించాలనేది తమ డిమాండ్ అని చెప్పారు. వీవీప్యాట్స్ లెక్కించడానికి ఆరురోజుల సమయం పడుతుందని ఎన్నికల అధికారులు అంటున్నారని, ఎన్నికల్లో మరింత విశ్వసనీయత పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.

More Telugu News