Aravind kejriwal: మోదీని 'జనరల్ డయ్యర్‌'తో పోలుస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్

  • మయాపురి ఏరియాలో ఉద్రిక్తత
  • జనాలపై రాళ్ల దాడి
  • పోలీసులు రాళ్లు రువ్వారంటూ ఆగ్రహం

 సుమారు 850 ఫ్యాక్టరీలను మూసివేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో వాటిని సీల్ చేసేందుకు ఢిల్లీ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు ప్రయత్నించారు. దీంతో న్యూ ఢిల్లీలోని మయాపురి ఏరియాలో ఉద్రిక్తత తలెత్తింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలకూ, స్థానికులకు మధ్య ఘర్షణ చెలరేగింది.

ఈ ఘటనలో జనాలపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనను నిరసిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రధాని మోదీని జనరల్ డయ్యర్‌తో పోలుస్తూ ట్వీట్ చేశారు. ‘జనరల్ డయ్యర్ మోదీ’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో చేసిన ఈ ట్వీట్‌‌ను, కేజ్రీవాల్ రీ ట్వీట్ చేశారు. పోలీసులు మయాపురి నివాసులపై రాళ్లు రువ్వారంటూ తీవ్ర స్థాయిలో కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News