Loksabha: తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్

  • రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సంరంభం 
  • మూడు దశల్లో ఎన్నికలు
  • మే 14న తుది దశ పోలింగ్
తెలంగాణ రాష్ట్రం మరోమారు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఈనెల నాలుగో వారంలో ప్రారంభం కానుంది. మూడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 5857 ఎంపీటీసీ స్థానాలు, 535 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఎన్నికల ప్రక్రియ మే 14 మూడో దశ పోలింగ్‌తో ముగియనుంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును మాత్రం లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాతే నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాతిపదికనే జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ తేదీ మే 6న జరుగుతుండగా, రెండో దశ వచ్చే నెల 10న, మూడో దశ వచ్చే నెల 14న జరగనున్నాయి.
Loksabha
MPTC
ZPTC
Telangana
Election Result

More Telugu News