Telugudesam: ఈసీ ఆఫీసును వైసీపీ, బీజేపీ పార్టీలు తమ బ్రాంచ్ ఆఫీసులా మార్చేశాయి: టీడీపీ ప్రతినిధి లంకా దినకర్

  • టీడీపీ అధికార ప్రతినిధి ప్రెస్ మీట్
  • జగన్, కేసీఆర్ ఓటర్ల స్ఫూర్తిని దెబ్బతీసేందుకు యత్నించారు
  • ఈవీఎంల గురించి చంద్రబాబు ముందే చెప్పారు

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ పోలింగ్ పరిణామాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్, కేసీఆర్, బీజేపీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓటింగ్ శాతాన్ని తగ్గించాలని కుట్రపన్నినా, ప్రజలు దాన్ని పటాపంచలు చేశారని తెలిపారు.

"వైసీపీ కుట్రలను, కుతంత్రాలను తిప్పికొడుతూ ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఈవీఎంల విషయంలో ఎన్ని సమస్యలు వస్తాయో చంద్రబాబు ముందు నుంచే చెబుతుండగా, నిన్నటి ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. ఓటింగ్ శాతాన్ని తగ్గించాలని వైసీపీ కుట్ర పన్నితే, కేసీఆర్ అందుకు సహకరించారు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులు ఏపీకి రాకుండా కేసీఆర్ బస్సులను అడ్డుకున్నారు. అయినాగానీ ప్రజలు ఎలాగోలా శ్రమపడి రాష్ట్రానికి చేరుకుని ఓటేశారు. ఇలాంటి అవాంతరాలు చూసి ప్రజల్లో కసి పెరిగిందే తప్ప తగ్గలేదు.

జగన్ తన మిత్రుడైన కేసీఆర్ తో కలిసి ప్రజాస్వామ్యం గొంతు నొక్కాలని చూశారు. బీజేపీని అడ్డుపెట్టుకుని ఎన్నికల సంఘం ద్వారా మంచి అధికారులను బదిలీ చేశారు. అధికారుల బదిలీల గురించి వైసీపీ నేతలకు ముందే ఎలా తెలిసింది? ఈ ఎన్నికల్లో ఓటర్ల స్ఫూర్తికి తూట్లు పొడవడానికి ఈసీ కూడా ఇతోధికంగా సాయం చేసింది. ఈసీ ఆఫీసును వైసీపీ, బీజేపీ పార్టీలు తమ బ్రాంచ్ ఆఫీసులా మార్చేశాయి. ప్రతి నియోజకవర్గంలో హింసకు ప్రణాళిక రచించారు. దాన్ని అరికట్టడంలో ఎన్నికల సంఘం విఫలమైంది.

స్వయానా ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపైనే దాడి జరిగింది. మంత్రి అఖిలప్రియ గారిపైనా దాడి జరిగింది, ఎమ్మెల్యే అభ్యర్థి శిరీష గారిపైనా దాడి చేశారు. ఈసీ ఇదంతా చోద్యంలా చూసిందే తప్ప చర్యలు తీసుకున్నది లేదు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News