Chandrababu: కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్న చంద్రబాబు.. ధర్నా చేపట్టే అవకాశం

  • మధ్యాహ్నం 12 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో సమావేశం
  • ఎన్నికల నిర్వహణ వైఫల్యాలపై ప్రశ్నించనున్న సీఎం
  • వీవీ ప్యాట్ లకు సంబంధించి సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయనున్న టీడీపీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాతో పాటు ఇతర కమిషనర్లను ఆయన కలవనున్నారు. ఈవీఎంలు మొరాయించడం, సైకిల్ కు ఓటేస్తే ఇతర గుర్తులకు ఓటు మరలిపోవడం వంటి ఘటనలను ఈ సందర్భంగా ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఎన్నికల నిర్వహణ వైఫల్యాలపై ప్రశ్నించనున్నారు.

చంద్రబాబుతో పాటు కళా వెంకట్రావు, యనమల తదితర ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనకు రావాలని పలువురు మంత్రులకు కూడా పిలుపు వెళ్లింది. టీడీపీ ఎంపీలందరూ ఈ సందర్భంగా చంద్రబాబు వెంట ఉండనున్నారు. మరోవైపు, ఈసీ వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలో చంద్రబాబు ధర్నా చేపట్టే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం. ఈ మేరకు చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ రివ్యూ పిటిషన్ ను కూడా వేయబోతోంది.
Chandrababu
delhi
ec
Telugudesam

More Telugu News