Telangana: టీఆర్ఎస్‌లో విలీనం వ్యవహారంలో.. నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

  • టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని లేఖ
  • ఆమోదించిన స్వామిగౌడ్
  • విలీనాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు

గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు తమ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని అప్పటి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కు లేఖ ఇవ్వగా ఆయన దాన్ని ఆమోదించారు. అయితే, ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ బాలాజీ, మల్లేశ్వరరావు అనే న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మండలి జారీ చేసిన బులెటెన్‌ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.

ఈ విలీన వ్యవహారంలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలకు తెలంగాణ హైకోర్టు నేడు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీలు ప్రభాకరరావు, ఆకుల లలిత, దామోదర్ రెడ్డి, సంతోష్‌కుమార్‌లతో పాటు శాసనమండలి చైర్మన్, కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానానికి వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

More Telugu News