Chandrababu: చంద్రబాబు మైండ్ కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడుతున్నారు: విజయసాయిరెడ్డి

  • ఈ ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు పట్టించుకోలేదు
  • అధికారులు, ఎన్నికల సంఘం వెంట బాబు పడ్డారు
  • ఈ  డ్రామాలు ఆపి బాబు మానసిక చికిత్స తీసుకోవాలి 
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు పట్టించుకోకపోయినా డ్రామాలు ఆడుతున్నారని, అధికారులు, ఎన్నికల సంఘం వెంట పడ్డారని విమర్శించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

చంద్రబాబు మైండ్ కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడుతున్నారని, ఈ డ్రామాలు ఆపేసి, ఓట్ల లెక్కింపు జరిగే వరకు మానసిక చికిత్స తీసుకోవాలంటూ విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ తీరును తప్పుబట్టిన చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ ను సంస్కరిస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ‘కోవర్ట్’ అని చంద్రబాబు అనడం సబబు కాదని అన్నారు.
Chandrababu
Telugudesam
YSRCP
mp
vijayasai reddy

More Telugu News