jc prabhakar reddy: భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి

  • పోలింగ్ సందర్భంగా వీరాపురంలో దాడులకు తెగబడ్డ టీడీపీ, వైసీపీ శ్రేణులు
  • వేట కొడవళ్లు, కర్రలతో దాడి
  • భాస్కర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానన్న ప్రభాకర్ రెడ్డి

పోలింగ్ సందర్భంగా హత్యకు గురైన తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ నేత భాస్కర్ రెడ్డి మృతదేహానికి ఆ పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నివాళి అర్పించారు. భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భాస్కర్ రెడ్డిని హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

నిన్న పోలింగ్ సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు వేట కొడవళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో టీడీపీ నేత భాస్కర్ రెడ్డి, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి హతమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాడిపత్రి మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వీరాపురం గ్రామం నివురుగప్పిన నిప్పులా ఉంది. తాడిపత్రిలో కూడా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 300 మందితో కూడిన కేంద్ర బలగాలు మోహరించాయి.

  • Loading...

More Telugu News