mayavathi: ఓటమి భయంతో బీజేపీ ఈవీఎం రిగ్గింగుల యోచనలో ఉంది: బీఎస్పీ అధినేత్రి మాయావతి

  • తొలివిడత ఎన్నికలతో ఆ పార్టీకి సీన్‌ అర్థమయింది
  • బీజేపీ చర్యలకు ఈసీ తీరు సహకరించేలా ఉంది
  • మిగిలిన ఆరు విడతల్లోనైనా ఈసీ తన సచ్చీలత నిరూపించుకోవాలి
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించిన కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వం ఈవీఎంల రిగ్గింగ్‌కు పాల్పడి మళ్లీ విజయం సాధించాలని చూస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఎన్నికల సంఘం తీరు కూడా వారికి అనుకూలం అన్నట్లు ఉందన్నారు. తొలివిడత ఎన్నికల పోలింగ్‌ నిన్న ముగిసిన సందర్భంగా మాయావతి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ప్రజలు బీజేపీని తిరస్కరిస్తున్నారని తొలివిడత పోలింగ్‌లో అర్థమయిందన్నారు. దీంతో అడ్డదారుల్లో విజయం కోసం అర్రులు చాస్తున్న బీజేపీ చర్యలను ఎన్నికల సంఘం అడ్డుకోవాలని, తన సచ్చీలత నిరూపించుకోవాలని కోరారు. అప్పుడే దేశంలోని సామాన్య ప్రజల విశ్వాసాన్ని కాపాడిన వారవుతారన్నారు.
mayavathi
BSP
BJP
evm rigging
EC

More Telugu News