Road Accident: ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం

  • కర్నూలు జిల్లా నందవరం మండలంలో ఘటన
  • ఉదయం ఐదున్నర గంటల సమయంలో ప్రమాదం
  • బాధితులు ఎమ్మిగనూరుకు చెందిన వారు 
జాతీయ రహదారిపై ఆగివున్న ట్యాంకర్‌ లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. నేటి ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. కర్నూలు జిల్లా నందవరం మండలం హాహర్వి గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ పార్క్‌చేసి ఉంది.

ఉదయం ఎర్రని కారులో ఎమ్మిగనూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. డ్రైవర్‌ ట్యాంకర్‌ను గమనించలేదో, కారు అదుపుతప్పిందోగాని వెనుక నుంచి ఢీకొట్టి లోపలికి దూసుకుపోయింది. దీంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Road Accident
three died
Kurnool District
emmiganur

More Telugu News