YSRCP: పోలీసులను, ఏజెంట్లను అడ్డం పెట్టుకుని పోలింగ్ జరిపించారుగా... నాకెంత మెజారిటీ వస్తుందో చూసుకోండి: చంద్రబాబుకు సవాల్ విసిరిన ఆమంచి

  • ఎన్ని ప్రయత్నాలు చేసినా అసెంబ్లీకి వెళ్లేది ఖాయం
  • ఎవరు గెలవాలో ఇక్కడి ప్రజలు నిర్ణయిస్తారు
  • చీరాలలోనే కాదు రాష్ట్రమంతా పోలింగ్ ఏకపక్షమే

ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన విజయంపై గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులకు పాల్పడినా తాను విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు. తాను శాసనసభలో ప్రవేశిస్తే చంద్రబాబు దొడ్డిదారి నుంచి పారిపోతారా? అంటూ ప్రశ్నించారు. తన నియోజకవర్గం చీరాలలోనే కాకుండా రాష్ట్రమంతటా వైసీపీ పవనాలు వీచాయని, ఎన్నికలు ఏకపక్షం అని ఆమంచి వ్యాఖ్యానించారు.

చీరాల నియోజకవర్గంలో పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "పోలీసులను, ఎన్నికల ఏజెంట్లను అడ్డం పెట్టుకుని పోలింగ్ జరిపించారుగా, ఇక్కడ నాకెంత మెజారిటీ వస్తుందో చూడండి! ఎవర్ని గెలిపించాలో, ఎవర్ని అసెంబ్లీకి పంపాలే ఇక్కడి ప్రజలే చూసుకుంటారు" అంటూ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News