YSRCP: ఇటువంటి పనులు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు సిగ్గుతో తలవంచుకోవాలి: వైఎస్ జగన్

  • ఎన్నికలు జరగకుండా చూడాలని బాబు కుట్ర పన్నారు
  • అలాగే, ఓటింగ్ శాతం తగ్గించేందుకు కుట్ర చేశారు
  • దేవుడి దయవల్ల 80 పైచిలుకు ఓటింగ్ నమోదైంది
ఎన్నికలు జరగకుండా చూడాలని, ఓటింగ్ శాతం తగ్గించాలని చంద్రబాబునాయుడు కుట్రలు పన్నారని, ఓ ముఖ్యమంత్రిగా తాను చేసిన పనికి ఆయన సిగ్గుతో తలదించుకోవాలని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవుడి దయవల్ల ఎనభై శాతం పైచిలుకు ప్రజలు పోలింగ్ లో పాల్గొనడం, బ్రహ్మాండంగా ఓట్లు వేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు రావడం హర్షణీయం అని అన్నారు.

ఇది ప్రజల విజయం అని, మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటు వేశామో వీవీప్యాట్స్ ద్వారా చూసుకుని సంతృప్తి చెందితే, ఇంకా, నెగెటివ్ కామెంట్స్ ఎవరు చేస్తారని అన్నారు. ఓడిపోతున్నాం కనుక బురదజల్లాలని అనుకునేవాళ్లే నెగెటివ్ కామెంట్స్ చేస్తారంటూ పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
YSRCP
Jagan
Telugudesam
Chandrababu
Hyderabad

More Telugu News