Andhra Pradesh: ఓ పార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి పడుతోంది.. ఈసీ చర్యలు తీసుకోవాలి!: పవన్ కల్యాణ్

  • ఏపీలో 10 శాతం ఈవీఎంలు పనిచేయట్లేదు
  • ఇందుకు కారణమేంటో మాకు తెలియదు
  • విజయవాడలో మీడియాతో జనసేన అధినేత

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 10 శాతానికి పైగా ఈవీఎంలు పనిచేయడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. అవి ఎందుకు పనిచేయడం లేదో తమకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఓ పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి పడుతున్నట్లు తమకు రిపోర్టులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని ఎలక్షన్ కమిషన్, కమిషనర్ ను కోరారు.

  • Loading...

More Telugu News