ఈ ఎన్నికలను అంగీకరించను... రీపోలింగ్ కావాల్సిందే: ఈసీకి చంద్రబాబు లేఖ!

  • 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదు
  • మూడు గంటలు వృథా అయింది
  • ఈవీఎంలు పనిచేయని చోట్ల  రీపోలింగ్ కావాలన్న చంద్రబాబు
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను తాము అంగీకరించబోమని, రాష్ట్రంలోని 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని, ఇప్పటికే మూడు గంటల సమయం వృథా అయిన కారణంగా ఈవీఎంలు పనిచేయని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషన్ ను ఉద్దేశించి ఆయన లేఖను రాశారు. ఈవీఎంల పనితీరుపై రాష్ట్రమంతటి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే  అది వైసీపీకి వెళుతున్నట్టు తెలుస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అన్ని పోలింగ్ బూత్ లలో ఓటర్లు మొత్తం వచ్చి ఓటేసేంత సమయం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్లు ఆందోళన చేస్తున్నా అధికారులు ఎవరూ స్పందించడం లేదని అన్నారు. 
Go Back to Shorts
Chandrababu
EVMs
EC
Repolling

More Telugu News