Mumbai: ఐపీఎల్‌లో అరంగేట్రం కోసం ఐదేళ్లు వేచి చూసిన సిద్దేష్.. తొలి బంతికి సిక్సర్

  • 2015 నుంచి ముంబై జట్టులో ఉన్న సిద్దేశ్
  • పంజాబ్‌తో మ్యాచ్‌తో తొలిసారి ఆడే అవకాశం
  • తొలి బంతికి సిక్స్.. మలి బంతికి ఫోర్

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు ఐదేళ్లు వేచి చూసిన ముంబై ఇండియన్స్ ఆటగాడు సిద్దేశ్ లాడ్ కోరిక ఎట్టకేలకు ఫలించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన సిద్దేశ్.. ఆడిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. 26 ఏళ్ల రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ అయిన లాడ్ రెండో బంతిని కూడా వదల్లేదు. దానిని బౌండరీకి తరలించాడు.

తీవ్ర గాయం కారణంగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో అతడి స్థానంలో సిద్దేశ్‌కు అవకాశం కల్పించారు. తొలి రెండు బంతులను సిక్సర్, ఫోర్ కొట్టిన సిద్దేశ్ అదే జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు. మొత్తం 13 బంతులు ఎదుర్కొన్న లాడ్ ఫోర్, సిక్సర్‌తో 15 పరుగులు మాత్రమే చేసి షమీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 2015 నుంచి ముంబై జట్టులో ఉన్న సిద్దేశ్‌కు ఐపీఎల్‌లో బ్యాట్ పట్టడం ఇదే తొలిసారి. కాగా, ఈ మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

More Telugu News