Chiranjeevi: ఫ్యామిలీతో వచ్చిన చిరంజీవి... ఓటేసిన రామ్ చరణ్, సురేఖ, ఉపాసన!

  • హైదరాబాద్ లో చిరంజీవికి ఓటు
  • 20 నిమిషాలు క్యూలైన్లో చిరు
  • అందరూ ఓటేయాలని వినతి
మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కొద్దిసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో ఓటు హక్కున్న చిరంజీవి, తన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనలతో కలిసి వచ్చి ఓటేశారు. తమ వంతు కోసం సుమారు 20 నిమిషాల పాటు వేచి చూసిన చిరంజీవి కుటుంబ సభ్యులు, ఆపై పోలింగ్ బూత్ లోనికి వెళ్లి ఓటేసి వచ్చారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ లోని పలు పోలింగ్ కేంద్రాల్లో సినీ ప్రముఖులు వచ్చి ఓటేస్తుండటంతో ఆయా బూత్ లలో సందడి నెలకొంది. ఈ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 
Chiranjeevi
Ramcharan
Upasana
Surekha
Vote
Hyderabad

More Telugu News