Chandrababu: ఇప్పటికైనా తెలిసి వచ్చిందా?: ఈవీఎంల మొరాయింపుపై ఈసీని ప్రశ్నించిన చంద్రబాబు!

  • ఈవీఎంలతో నష్టమే
  • బ్యాలెట్ అయితేనే మేలు
  • ఈవీఎంల వాడకంపై రివిజన్ పిటిషన్ వేసే ఆలోచన
  • ఓటు వేసిన అనంతరం చంద్రబాబు

ఈవీఎంలతో జరిగే నష్టం ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కు తెలిసి వచ్చి ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎన్నికలు ప్రారంభం కాగా, పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ముఖ్యంగా ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ ఓటేసేందుకు వెళ్లిన కేంద్రంలోనే మెషీన్ పనిచేయకపోవడంపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ఈవీఎంల దుర్వినియోగంపై తాను ఎప్పటినుంచో మాట్లాడుతున్నానని, ఇప్పటికైనా ఈసీ అర్థం చేసుకోవాలని అన్నారు. ఈవీఎంలతో జరిగే నష్టాన్ని గుర్తించాలని కోరారు. బ్యాలెట్ అయితే ఏ సమస్యా ఉండదన్నారు. ఈవీఎంల వాడకంపై రివిజన్ పిటిషన్ వేయాలన్న ఆలోచనలో ఉన్నామని చంద్రబాబు తెలిపారు.

  • Loading...

More Telugu News